Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

Follow Udayam on Google
Ganga Oct 03, 2026 4:44 PM పార్వతీపురం మన్యంGeneral
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం ఎల్విన్ పేటలో ఎంపీడీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి దుకాణం వద్ద చెత్త బుట్టలను ఏర్పాటు చేయాలని, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...