Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటికి నో.. తాగునీటికే ప్రాధాన్యం

Follow Udayam on Google
భరత్ తేజ Jul 16, 2026 7:12 AM హైదరాబాద్General
సాగునీటికి నో.. తాగునీటికే ప్రాధాన్యం - Udayam
రాష్ట్రంలోని రిజర్వాయర్ల నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించాలని, సాగునీటిని విడుదల చేయరాదని స్కీవమ్ (రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ) ఆదేశించింది. జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో రిజర్వాయర్ల లైవ్ స్టోరేజీ వివరాలపై ఈఎన్సీ రమేష్‌బాబు సమీక్షించారు. లైవ్ స్టోరేజీ వివరాలు లేకుండా రావడంతో 'కాడా' అధికారులపై ఈఎన్సీ మండిపడ్డారు. ఆగస్టులోపు ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు వస్తేనే సాగునీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...