Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రహరీ లేని పాఠశాలకు భద్రత కరువు

Follow Udayam on Google
Muthyam silari Sep 05, 2026 12:26 PM నిర్మల్General
దిలావర్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. శిథిలావస్థకు చేరిన పాత గోడను ఇటీవల కూల్చివేయగా, కొత్త ప్రహరీ నిర్మాణం మాత్రం చేపట్టలేదు. దీంతో పందులు పాఠశాల ఆవరణలోకి వస్తూ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. చిన్నారుల భద్రత, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే కొత్త ప్రహరీ నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...