Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీపై అసభ్యకర వ్యాఖ్యలు... చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

Follow Udayam on Google
U.S.Rao Oct 02, 2026 1:53 PM కాకినాడGeneral
ప్రధాని మోదీపై అసభ్యకర వ్యాఖ్యలు... చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీపై అత్యంత అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ఆదేశాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండల బీజేపీ అధ్యక్షుడు శరణం రాజబాబు, ఓబీసీ నాయకులు కంటా కాశీ విశ్వనాధం, పెంటకోట సత్యనారాయణ, కోలా కృష్ణ తదితరులు ఫిర్యాదును సమర్పించారు.

Comments

G
Loading comments...