Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు

Follow Udayam on Google
C.JHAN Aug 26, 2026 2:50 PM బాపట్లGeneral
పర్చూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు - Udayam
పర్చూరులో బుధవారం ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో వైభవంగా ర్యాలీ నిర్వహించారు. ప్రవక్త ముహమ్మద్ సమాజానికి శాంతి, సహనం, సోదరభావం, క్షమాగుణం, మానవీయ విలువలను అందించారని వారు కొనియాడారు. ఆయన జీవిత విశేషాలను, దివ్య బోధనలను స్మరించుకుంటూ ఈ శుభదినాన ప్రత్యేక ప్రార్థనలు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...