Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం గీత కార్మికుల హామీలను నెరవేర్చాలని డిమాండ్

Follow Udayam on Google
p.g.murthy Aug 15, 2026 10:59 AM మంచిర్యాలGeneral
ప్రభుత్వం గీత కార్మికుల హామీలను నెరవేర్చాలని డిమాండ్ - Udayam
గత ఎన్నికల సందర్భంగా గీత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన గీతన్నాల చైతన్య యాత్ర శనివారం జన్నారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సంఘం నాయకులు పూలమాలలు వేశారు. గీతన్నలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు.

Comments

G
Loading comments...