వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని దౌడపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు రాఖి పండుగను ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యార్థినిలు రాఖీలు కట్టారు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమని పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు వేణుగోపాల్ , సతీష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

