Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రికి 30 కుర్చీలు విరాళం

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 11, 2026 6:25 PM నిజామాబాద్General
ప్రభుత్వ ఆసుపత్రికి 30 కుర్చీలు విరాళం - Udayam
సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతిభ ప్రైవేట్ హై స్కూల్ కరస్పాండెంట్ సుంకం హరీష్ 30 కుర్చీలను విరాళంగా అందజేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు కూర్చునేందుకు ఈ కుర్చీలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం 30 కుర్చీలను విరాళంగా అందించిన సుంకం హరీష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...