Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాది పడాలి : MEO

Follow Udayam on Google
RAGHU SKLM Sep 07, 2026 12:59 PM శ్రీకాకుళంGeneral
ప్రాథమిక స్థాయిలోనే బలమైన పునాది పడాలి : MEO - Udayam
విద్యార్థులలో ప్రాథమిక దశ నుంచే సామర్థ్యాలు మెరుగుపడేలా బోధన సాగాలని ఎంఈఓ ఉప్పాడ శాంతారావు ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం ఉర్లాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన, విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయిలోనే పునాది బలంగా వేస్తే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...