Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టాఫీస్ తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి

Follow Udayam on Google
Ganga Sep 26, 2026 6:44 PM పార్వతీపురం మన్యంGeneral
పోస్టాఫీస్ తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి - Udayam
గుమ్మలక్ష్మీపురం (మ) కేంద్రంలో వందేళ్లుగా సేవలందిస్తున్న సబ్ పోస్టాఫీస్ను ఎల్విన్పేటకు తరలించే నిర్ణయాన్ని విరమించుకోవాలని గిరిజన సంఘ నాయకులు గౌరీ శంకర రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానికులతో కలిసి ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. పోస్టాఫీస్ తరలిస్తే మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోస్ట్ ఆఫీస్ ఇక్కడే కొనసాగించాలన్నారు.

Comments

G
Loading comments...