Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోనకల్ సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో వినతి

Follow Udayam on Google
Muthyam silari Aug 31, 2026 6:12 PM నిర్మల్General
పోనకల్ సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో వినతి - Udayam
పోనకల్ గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రజావాణిని ఆశ్రయించింది. మామడ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, స్మశానవాటిక స్థలానికి హద్దులు నిర్ణయించాలని కోరుతూ అధికారులకు దరఖాస్తు సమర్పించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...