వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఈవో రాహుల్ తెలిపారు. సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఆదేశాల మేరకు బుధవారం గ్రామంలోని శ్రీలంక కాలనీలో స్థానిక వార్డు సభ్యులు మోసిన్ తో కలిసి ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీలో ఉన్న డ్రైనేజీలను శుభ్రం చేయించారు. శ్రీలంక కాలనీ లోతట్టు ప్రాంతంలో ఉందని, వరద నీరు నిలవకుండా డ్రైనేజీలను శుభ్రం చేయించామన్నారు.
Comments
Loading comments...

