వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి: స్థానిక రూరల్ ప్రాంతానికి చెందిన ఎనగందుల రఘుదీప్ ఇటీవల పోగొట్టుకున్న మొబైల్‌ను పోలీసులు క్షేమంగా రికవరీ చేసి అతడికి అందజేశారు. అధునాతన సైబర్ సాంకేతికత ఆధారంగా సిబ్బంది ప్రశాంత్ ఫోన్ చిరునామాను కనిపెట్టారు.
అనంతరం ఎస్ఐ మధుకర్, ఏఎస్ఐ తిరుపతి సమక్షంలో బాధితుడికి దానిని చేరవేశారు. సమర్థవంతంగా పనిచేసి సెల్‌ఫోన్‌ను వెతికిపెట్టిన పోలీస్ బృందాన్ని పలువురు ప్రశంసించారు.
Comments
Loading comments...

