వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం బుద్ధసముద్రంలో పోచమ్మ దేవత విగ్రహాన్ని సోమవారం ఘనంగా ప్రతిష్టించారు. ఈ ప్రతిష్టాపన వేడుకకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పాల్గొని పోచమ్మ దేవతను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
ఈసందర్భంగా గ్రామ ప్రజలు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామాంజనేయులు, ఉప సర్పంచ్ అరుణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

