వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలోని శ్రీలంక కాలనీలో ప్రజలు, భక్తులు పోచమ్మ అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించారు. ఆషాడ మాసం బోనాలు సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీలంక కాలనీలో మహిళలు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
అనంతరం భక్తులు, మహిళలు వారి ఇళ్లలో బోనాలను ప్రత్యేకంగా తయారు చేసి అమ్మవారి ప్రతిమ వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి భక్తులు బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Loading comments...

