Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొంగులేటి రాజీనామా చేయాలి: హరీశ్‌రావు

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 4:55 PM సిద్దిపేటGeneral
పొంగులేటి రాజీనామా చేయాలి: హరీశ్‌రావు - Udayam
నిషేధిత భూముల జాబితా వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సీఎం, మంత్రులు చేసిన తప్పును అధికారులపైకి నెట్టడం సరికాదన్నారు. ప్రజల భూములను జాబితాలో ఎవరు చేర్చారో, ఎవరు చేర్పించారో వాస్తవాలు బయటపెట్టాలని హరీశ్‌రావు కోరారు. నిషేధిత భూముల తొలగింపు పేరుతో కబ్జా భూములను క్రమబద్ధీకరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...