Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరులో సిమెంట్ రోడ్లకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:46 PM ప్రకాశం General
పొందూరులో సిమెంట్ రోడ్లకు శ్రీకారం - Udayam
పొందూరు గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రూ.40 లక్షల అంచనా వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టంగుటూరు ఎస్‌ఐ ఫణిభూషణ్, కూటమి నేతలు పనులను ప్రారంభించారు. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. క్రిస్టియన్‌పాలెం, హరిజనవాడ, ఎస్టీ కాలనీల్లో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...