Back to feed
పాలిటెక్నిక్ సీట్ల కౌన్సెలింగ్ షెడ్యూల్
Sonia Singh May 26, 2026 6:52 AM హైదరాబాద్ 20 views1 day ago

తెలంగాణలో టీజీ పాలిసెట్ మొదటి విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ బుధవారం నుండి ప్రారంభం కానుంది. ఈ ఏడాది 111 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 33,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ కండక్టర్ టెక్నాలజీలో 720 సీట్లు కేటాయించారు.
మే 27 నుండి 31 వరకు అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. జూన్ 1 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. అర్హులైన విద్యార్థులకు జూన్ 6న తొలి విడత సీట్లను కేటాయించనున్నారు.
Comments
Loading comments...



