Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 20, 2026 6:38 PM హైదరాబాద్General
పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం - Udayam
పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత విభాగాల సమీక్ష సమావేశంలో సంక్షేమ పథకాల పురోగతిపై చర్చించారు. సిబ్బందికి వివాహ, వైద్య, విద్యా రుణాలు, మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందిస్తూ ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. వెల్ఫేర్ సేవలను డిజిటలైజ్ చేసి పారదర్శకతను పెంచాలని, కమర్షియల్ కాంప్లెక్స్‌ల అద్దెలను పారదర్శకంగా నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...