Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులమంటూ ఘరానా దోపిడీ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 15, 2026 9:20 AM కృష్ణా జిల్లాGeneral
పోలీసులమంటూ ఘరానా దోపిడీ - Udayam
వృద్ధులే లక్ష్యంగా తాము పోలీసులమంటూ బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల నేరస్థులు కిరణ్‌కుమార్, మురళీలను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనంలో గంజాయి ఉందంటూ నమ్మించి బాధితుల నుండి నగదు దోచుకున్నట్లు డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుని, వారి నుంచి రూ.57 వేల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...