Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 10:49 AM ఏలూరుGeneral
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్ - Udayam
భీమడోలు బీసీ కాలనీలో పేకాట శిబిరంపై గురువారం పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఎస్సై ఎస్కే మదీనాబాషా ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారి నుంచి రూ.51 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

Comments

G
Loading comments...