వార్తలకు తిరిగి వెళ్లండి
పోలవరం కాలువ మట్టి కొల్లగొట్టి

కాకినాడ జిల్లాలో పొలాలను లేఅవుట్లుగా మార్చేందుకు పోలవరం ఎడమ కాలువ మట్టిని అక్రమార్కులు పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వి తరలిస్తున్నారు. ధవళేశ్వరం డివిజన్-2 పరిధిలో ఈ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
ఈ మట్టి కేటుగాళ్లకు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గాదరాడ నుంచి జగ్గంపేట వరకు ఉన్న 25 కిలోమీటర్ల కాలువ పరిధిలో ఈ దందా జోరుగా సాగుతోంది.
Comments
Loading comments...