వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా గోదావరిఖని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ ఇంద్రసేనారెడ్డి సూచించారు. సొంత గ్రామాలకు వెళ్లేవారు విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని లేదా తమ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
ప్రయాణాల్లో మహిళలు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, బతుకమ్మ వేడుకల్లో చైన్ స్నాచింగ్ జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

