వార్తలకు తిరిగి వెళ్లండి
భైంసా మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ల నిరసన చేపట్టారు. గత ఏడాది నిర్వహించిన వినాయక చవితి, దుర్గానవరాత్రులు, దసరా, ధర్మచక్ర పరివర్తన దివస్ పనుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు ధర్నాకు దిగారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ "కమిషనర్ డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేశారు. న్యాయం జరిగే వరకు టెంట్ వేసి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

