వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపాలేం గ్రామ పంచాయతీని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దని కోరుతూ గ్రామ ప్రజలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తోటపాలేం ప్రజలు వ్యవసాయం, కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్నారని, విలీనంతో అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని తెలిపారు.
ఉపాధి హామీ, పంచాయతీ ఆధారిత సంక్షేమ పథకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

