వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందించేందుకు కేంద్రం ‘పీఎం రాహత్’ పథకాన్ని అమలు చేస్తోంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో జూన్ నుంచి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ఆస్పత్రిలో చేరిస్తే రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందని అధికారులు తెలిపారు. అత్యవసర సమయంలో 112కు కాల్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

