Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి: మున్సిపల్‌ ఛైర్‌పర్సన్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 06, 2026 4:41 PM నారాయణపేటGeneral
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి: మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ - Udayam
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని నారాయణపేట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ కొండా శ్వేతా అన్నారు. వనమహోత్సవంలో భాగంగా గురువారం చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. చెట్లు పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతకు తోడ్పాటు అందుతుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఛైర్‌పర్సన్ మంజుల, కమిషనర్ శంకర్, ప్రిన్సిపల్ మెర్సీ వసంత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...