Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత: తహశీల్దార్

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:35 PM ఆదిలాబాద్General
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత: తహశీల్దార్ - Udayam
తాంసి మండలం పొన్నారి గ్రామంలో బుధవారం వన మహోత్సవం నిర్వహించారు. తహశీల్దార్ జాదవ్ గణేశ్ గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. తహశీల్దార్ జాదవ్ గణేశ్ నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ భూమన్న, మాజీ వైస్ ఎంపీపీ రఘు, రామ్‌రెడ్డి లక్ష్మిపతి, అశోక్, ఆశన్న, ఆడేళ్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...