వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పింజరమడుగులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ గ్రామసభ నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు.
కార్యదర్శి ఓటరు లిస్టు చదివి వినిపించగా, లోపాలను అధికారుల దృష్టికి తెచ్చారు. ప్రతి ఒక్కరూ గ్రామసభలకు హాజరై ఓటు హక్కు సరిచూసుకోవాలని నాగేశ్వరరావు కోరారు. ఈ సభలో బిఎల్వోలు, సర్పంచ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

