వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుంద మండలానికి చెందిన ఉపాధ్యాయులు పీఆర్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ నిర్వహించిన మహాధర్నాకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ నాయకులు శ్రీనివాస్, ఈర్షద్ మాట్లాడుతూ
ప్రభుత్వం పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డీఏ అమలు చేసి, సీపీఎస్ను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

