Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్లలో ముస్లిం మహిళలు ధర్నా చేపట్టారు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 8:56 PM పల్నాడుGeneral
పిడుగురాళ్లలో ముస్లిం మహిళలు ధర్నా చేపట్టారు - Udayam
పిడుగురాళ్లలోని బైపాస్ పక్కన 90 సెంట్ల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నారని ముస్లిం మహిళ సయ్యద్ రోషన్ బీ ఆరోపించారు. అతను తమపై దౌర్జన్యం చేస్తున్నాడని పేర్కొంటూ న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు ముస్లిం మహిళలు బైపాస్ రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తహశీల్దార్ కార్యాలయానికి రావాలని సూచించారు.

Comments

G
Loading comments...