వార్తలకు తిరిగి వెళ్లండి
కుబీర్ మండలం చోండి గ్రామ శివారులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. భైంసా వైపు వెళ్తున్న ఫోర్‌వీలర్ వాహనం రోడ్డుపై ఉన్న గేదెలు, ఆవును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు గేదెలు మృతి చెందగా, ఓ ఆవు తీవ్రంగా గాయపడింది.
వాహనం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదంపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

