వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరింది. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 13 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్లకు 111 పరుగులు చేసింది.
112 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ 11.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అబ్దుల్ సమద్ 30, హసన్ నవాజ్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఓడిన బంగ్లాదేశ్ కాంస్యం కోసం పోటీపడనుంది.
Comments
Loading comments...

