వార్తలకు తిరిగి వెళ్లండి

పెరవలి గ్రామంలో బస్‌షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 16వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ గ్రామం మీదుగా పరిసరాల్లోని సుమారు 14 గ్రామాల ప్రజలు విశాఖ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు.
దశాబ్దాలుగా బస్‌షెల్టర్ ఏర్పాటు చేయాలని పలుమార్లు వినతులు సమర్పించినా ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తణుకు వెళ్లి బస్సులు ఎక్కాల్సి వస్తోందన్నారు.
Comments
Loading comments...

