Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాంకిడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SI

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:10 AM ఆసిఫాబాద్General
వాంకిడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SI - Udayam
వాంకిడి మండలంలో మోస్తరు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ మహేందర్‌ సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాగుల పరివాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాగులు, చెరువులు, గుంతలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటి వద్దకు వెళ్లొద్దని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్‌ చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...