వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ పింఛను ఇంటికి పెద్ద కొడుకు వలె అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో DRDA PD శ్రీనివాస పాణి పాల్గొన్నారు.
Comments
Loading comments...

