వార్తలకు తిరిగి వెళ్లండి

అంధులు, బధిరుల గురుకులాల్లో చదివే దివ్యాంగ విద్యార్థులు కోరుకున్న విధానంలో పింఛను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతా, ఇంటి వద్ద లేదా పాఠశాలలోనే పింఛను పొందే అవకాశం కల్పించనుంది.
అక్టోబర్ నుంచి ఈ విధానం అమలుకు సెర్ప్ కసరత్తు చేస్తోంది. సర్వేలో 424 మంది విద్యార్థుల అభిప్రాయాలు సేకరించగా, వారిలో 113 మందికి ప్రస్తుతం పింఛను అందడం లేదని గుర్తించారు.
Comments
Loading comments...

