Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి: కార్మికులు

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:34 PM నిర్మల్ General
పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి: కార్మికులు - Udayam
కడెం మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుజాతకు వినతిపత్రం అందజేశారు. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని, రెండు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగేష్, రాజన్న, రమేశ్, పోశం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...