వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన రామనారాయణ స్వరూప్ (28) మంగళవారం రాత్రి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న స్వరూపుకు ఇటీవల వివాహం నిశ్చయమైంది.
రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
Comments
Loading comments...

