వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని అన్నా క్యాంటీన్‌ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. క్యాంటీన్‌లో అందిస్తున్న భోజనం నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.
భోజనం కోసం వచ్చిన ప్రజలతో మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

