Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద పిల్లలకు సమగ్ర విద్యే లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Aug 27, 2026 5:00 PM శ్రీకాకుళంGeneral
పేద పిల్లలకు సమగ్ర విద్యే లక్ష్యం - Udayam
నిరుపేద, బలహీన వర్గాల చిన్నారులు విద్యకు దూరం కాకుండా చూడటమే ‘నల్సా శిక్ష 2026’ పథకం లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. హరిబాబు తెలిపారు. గురువారం పాఠశాలల యాజమాన్యాలతో అవగాహన సదస్సులో మాట్లాడారు. పిల్లలు చదువు మధ్యలో నిలిపివేయకుండా న్యాయ సహాయం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి చిన్నారికి విద్య అందేలా ప్రైవేట్ పాఠశాలలు, విద్యాశాఖ సమన్వయంతో పనిచేయాలని కోరారు.

Comments

G
Loading comments...