Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెడపర్తిలో వెల్నెస్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

Follow Udayam on Google
devendra Aug 14, 2026 1:19 PM తూర్పుగోదావరిGeneral
పెడపర్తిలో వెల్నెస్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి - Udayam
వైద్య విద్య, వ్యవసాయ, ఉపాధి రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం పెడపర్తిలో రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...