వార్తలకు తిరిగి వెళ్లండి
దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కల్లపెల్లి అశోక్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

