వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కేఈ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా పాత శివాలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లె పవన్ కుమార్ ఆధ్వర్యంలో అర్చకులు సత్యస్వామి భస్మార్చన, కుంకుమార్చనతో పాటు పరమశివుడికి ప్రత్యేక అభిషేకం చేశారు.
కేఈ కృష్ణమూర్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని, పత్తికొండ అభివృద్ధి మరింత వేగంగా సాగాలని ప్రార్థించారు.
Comments
Loading comments...

