వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ తెలుగు ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన పద్యాల పోటీల్లో గొల్లపల్లి మోడల్ స్కూల్ 7వ తరగతి విద్యార్థి మొకిలి గౌతమ్ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
పోతన, నన్నయ పద్యాలను రాగయుక్తంగా ఆలపించి న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాడు. ప్రిన్సిపల్ సుంకరీ రవి, ఉపాధ్యాయులు గౌతమ్‌ను అభినందించారు.
Comments
Loading comments...

