వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి కాలనీలో రామకృష్ణ థియేటర్ వెనుక గంటల తరబడి తాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. నిత్యం ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలు కాలనీల్లో నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు తాగునీరు వృథా అవుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లీకేజీని అరికట్టాలని కోరారు.
Comments
Loading comments...

