Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాలపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jun 27, 2026 2:14 PM అమరావతిGeneral
రాజకీయాలపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు - Udayam
వైకాపా నేతలు విధానాలపై కాకుండా తిట్ల దండకం అందుకోవడమే పనిగా పెట్టుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. కుల రాజకీయాలను తాను ఎప్పటికీ ప్రోత్సహించనని, అందరికీ ఒకటే హాస్టల్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మంగళగిరిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తిస్తామని తెలిపారు. సమాచార సేకరణ కమిటీలు పారదర్శకంగా పనిచేసి, నిజమైన శ్రమజీవులను తన దృష్టికి తీసుకురావాలని పవన్ సూచించారు.

Comments

G
Loading comments...