వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బదులిచ్చారు. నటుడిగా పవన్‌ను గౌరవిస్తామని, సోదరుడిగా వస్తే బిర్యానీ పెడతాం కానీ, ఇక్కడి రాజకీయాల్లో పెత్తనం చెలాయిస్తే అస్సలు ఊరుకోమని స్పష్టం చేశారు.
దేశభక్తి, పోరాటాల గురించి తాము పవన్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ ఓజీ కేసీఆరేనని కేటీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటవుతుంటే అన్నం తినలేదన్న పవన్, ఇప్పుడు ఇక్కడకు వచ్చి రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
Comments
Loading comments...

