వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో పంటపొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల సమస్యా పరిష్కారానికి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులకు అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. వాటిపై పూలు జల్లి, ప్రేమగా చెరకు గడలు తినిపించారు.
అడవి ఏనుగులను సమర్థవంతంగా కట్టడి చేసేందుకే ఈ ప్రత్యేక కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా చర్యలతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
Comments
Loading comments...

