వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ప్రోటీన్ ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమెల రాజు కోరారు. గురువారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాస ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టిక ఆహారం, ఆరోగ్య సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

